తవణంపల్లి విద్యార్థిని ప్రతిభకు మెరుగైన గుర్తింపు
CTR: తవణంపల్లి మండలం ఎం.బోయపల్లి గ్రామానికి చెందిన బీ.కీర్తన గంగవరం బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఈ మేరకు విద్యార్థిని జిల్లా, రాష్ట్ర స్థాయి 200 మీటర్ల పరుగుపోటీలలో 4వ స్థానంలో నిలిచి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పేద కుటుంబం కావడంతో ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం అందితే రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిపెడుతుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.