మీ అబద్ధాలు వింటే నవ్వొస్తోంది: కిమిడి నాగార్జున

మీ అబద్ధాలు వింటే నవ్వొస్తోంది: కిమిడి నాగార్జున

VZM: దేశ, విదేశాల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, కూటమి నాయకులకు వస్తున్న పేరు ప్రఖ్యాతలు చూసి జగన్ అసూయ పడుతున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున విమర్శించారు. విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌పై జగన్ చెప్పిన అబద్ధాలు వింటే నవ్వొస్తోందని అన్నారు. శుక్రవారం చీపురుపల్లి ఆయన నివాసంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో మాట్లాడారు.