డ్రాగన్ ఫ్రూట్.. తింటే సమస్యలన్నీ ఔట్!

డ్రాగన్ ఫ్రూట్.. తింటే సమస్యలన్నీ ఔట్!

చూడటానికి విభిన్నంగా కనిపించే డ్రాగన్ ఫ్రూట్ ఒక పోషకాల గని అని, దీన్ని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజుకో పండు తింటే ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటామంటున్నారు. దీనిలోని మెగ్నీషియం స్ట్రోక్ ప్రమాదాలను తగ్గించడానికి, డైటరీ ఫైబరీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి తోడ్పడతాయని పేర్కొంటున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ ఇమ్యూనిటీని పెంచుతాయంట.