కోటలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
TPT: కోట మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. తిమ్మనాయుడుపాలెం గ్రామానికి వెళ్లే ప్రధాన మార్గంలోని చెరువు కట్ట వద్ద మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆ దారి వెంట వెళ్తున్న ప్రయాణికులు మృతదేహాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.