'తుగ్గలిని కరవు మండలంగా ప్రకటించాలి’
KRNL: తుగ్గలిని కరవు మండలంగా ప్రకటించాలని సీపీఎం మండల అధ్యక్షుడు శ్రీరాములు కోరారు. మంగళవారం ఎంపీడీవో విశ్వమోహన్‌కు వినతిపత్రం అందజేశారు. అధిక వర్షాల వల్ల రైతులు సాగుచేసిన పంటలు దిగుబడులు రాక తీవ్రంగా నష్టపోయారన్నారు. దీంతో రైతులు, రైతు కూలీలు చేసిన అప్పులు తీర్చలేక సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని వివరించారు.