ఒంటరితనం భరించలేక వ్యక్తి ఆత్మహత్య

KNR: గంగాధర మండలం మధురానగర్‌లో అల్లకుంట గంగారాం అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఐదేళ్లలో భార్య, ఇద్దరు పిల్లలు మరణించడంతో.. ఒంటరితనం భరించలేక శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్ద కొడుకు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు గంగాధర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.