అక్రమంగా మద్యం విక్రయిస్తున్న హోటల్ సీజ్

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న హోటల్ సీజ్

SDPT: అనుమతులు లేకుండ మద్యం విక్రయిస్తున్న హోటల్‌ను సిద్దిపేట పోలీసులు, మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. వివరాలు.. సిద్దిపేట వేములవాడ కమాన్ వద్ద ఉన్న గాయత్రి హోటల్లో అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్‌కు సమాచారం అందింది. దీంతో ACP రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో హోటల్‌ను సీజ్ చేశారు.