VIDEO: 'భారీ వర్షాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్'

ADB: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం సాయంత్రం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నిఘా పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన చోట సహాయక బృందాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.