కైలాపూర్‌లో మూఢనమ్మకంతో గ్రామం ఖాళీ

BHPL: చిట్యాల మండలం కైలాపూర్ గ్రామంలో ఊరుకు కీడు సోకిందని జ్యోతిష్యుడు చెప్పడంతో గ్రామస్థులు గురువారం తెల్లవారుజామున ఇళ్లకు తాళాలు వేసి, వాకిలి ఊడ్చకుండా గ్రామ శివారులోని చెట్ల కిందకు వెళ్లారు. అక్కడ వన భోజనాలు చేశారు. గ్రామ పెద్దల నిర్ణయంతో ఊరంతా ఖాళీ అయింది. ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మవద్దని మేధావులు సూచిస్తున్నారు.