ప్రశాంతంగా ముగిసిన బంద్.. కానరాని ప్రభావం
ASR: మారేడుమిల్లిలో జరిగిన ఎన్ కౌంటర్‌కు నిరసనగా ఆదివారం మావోయిస్టులు పిలుపునిచ్చిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కొయ్యూరు, జీకేవీధి, సీలేరు తదితర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రాజేంద్రపాలెం వారపు సంత యథావిధిగా జరిగింది. పలుచోట్ల దుకాణాలు పనిచేశాయి.