'రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థులు సత్తాచాటాలి'

JGL: జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థులు సత్తా చాటాలని ఇబ్రహీంపట్నం మండల విద్యాధికారి మధు అన్నారు. ఇబ్రహీంపట్నం జడ్పీ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలు నిన్న సాయంత్రం ముగిశాయి. మండల స్థాయి పోటీల్లో ప్రతిభకనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేశారు. విజేతలకు మెడల్స్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వర ప్రసాద్ పాల్గొన్నారు