గుర్తుతెలియని మృతదేహం లభ్యం
SRD: సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు డ్యాం దగ్గర గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతదేహం లభించిందని ఎస్సై మహేష్ గురువారం తెలిపారు. స్థానికులు సమాచారం ప్రకారం స్థలానికి వెళ్లి పరిశీలించగా వ్యక్తి వయస్సు 50 ఏళ్లు ఉండొచ్చని చెప్పారు. ఎవరైనా ఈ శవాన్ని గుర్తుపడితే సిర్గాపూర్ పోలీస్ ఫోన్ 8712656759 నెంబర్ కు సమాచారం ఇవ్వాలన్నారు.