నగరంలో విదేశీ గంజాయి కలకలం

నగరంలో విదేశీ గంజాయి కలకలం

HYD: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. అమెరికా నుంచి తెచ్చిన 170 గ్రాముల విదేశీ గంజాయిని గచ్చిబౌలిలో పోలీసులు సీజ్ చేశారు. దీన్ని సరఫరా చేస్తున్న శివరామ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అబయ్ పరారీలో ఉన్నాడు. అమెరికా నుంచి గంజాయిని తెచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.