గురవాజిపేటలో అంగన్వాడి కార్యకర్తల సమావేశం
ప్రకాశం: కనిగిరి మండలం గురవాజిపేట అంగనవాడి కేంద్రం నందు బుధవారం సూపర్వైజర్ పార్వతి అంగన్వాడీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం లబ్ధిదారుల నమోదు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ డిజిటల్ అకౌంట్‌ను పూర్తి చేయాలని తెలిపారు. అంగన్వాడి కేంద్రాలలో మంచినీటి వసతుని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.