శ్రీహరిపురంలో దారుణ ఘటన
VSP: శ్రీహరిపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన కమలాసింగ్(39)ను మతిస్థిమితం సరిగా లేక పోవడంతో పనిలోంచి తీసేశారు. స్వగ్రామానికి వెళ్లేందుకు విశాఖ రైల్వే స్టేషన్‌కు వెళ్లే క్రమంలో కనిపించకుండా పోయాడు. అనంతరం ఓ భవనంపై కేబుల్ వైర్లు మెడకు చుట్టుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.