లాడ్జిలో యువకుడు ఆత్మహత్య

లాడ్జిలో యువకుడు ఆత్మహత్య

SRD: రామచంద్రాపురంలో విషాదం చోటుచేసుకుంది. OYO లాడ్జిలో అఖిల్(30) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్‌లో రూ.6 లక్షలు నష్టపోవడమే ఈ ఘటనకు కారణమని సమాచారం. అయితే అఖిల్ చనిపోయే ముందు తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడని, తండ్రి అక్కడకు చేరుకునే లోపే ఉరివేసుకున్నాడని తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.