ఆలయ అభివృద్ధికి మరో రూ.14.10 కోట్లు
TPT: ఎర్రావారిపాళ్యం మండలం నెరబైలు పంచాయతీలోని శ్రీతలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు టీటీడీ పాలకమండలి రెండో దశలో రూ.14.10 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే మొదటి దశలో రూ.4 కోట్లు మంజూరు కాగా,మొత్తం రూ.20 కోట్లతో ఆలయ అభివృద్ధి చేపట్టనుంది. నిధులు మంజూరు చేసిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి ,చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కృతజ్ఞతలు తెలిపారు.