24న సింగరేణి ఆసుపత్రిలో మెడికల్ క్యాంపు

24న సింగరేణి ఆసుపత్రిలో మెడికల్ క్యాంపు

BHPL: ఏరియా సింగరేణి ఆసుపత్రిలో ఈనెల 24న సూపర్ స్పెషలిస్ట్ వైద్యులతో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గుండె, నరాల, మూత్రపిండాల, జీర్ణాశయ, జనరల్ సర్జన్ , జనరల్ ఫిజీషియన్, సూపర్ స్పెషలిస్ట్ వైద్య నిపుణులు వస్తారన్నారు. వైద్య సేవలు పొందాలనుకునే వారు 23వ తేదిలోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.