కూటమి అభ్యర్థి ధర్మరాజు ప్రచారం

పశ్చిమగోదావరి: జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భిన్నమైన సంక్షేమ పథకాలను అందిస్తామని ఉంగుటూరు అభ్యర్థి ధర్మరాజు అన్నారు. జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం సీతారామపురంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరిగి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.