బిందెలో ఇరుక్కున్న చిన్నారి తల

బిందెలో ఇరుక్కున్న చిన్నారి తల

SRCL: జిల్లా కేంద్రంలోని సంజీవయ్య నగర్‌లో ఓ చిన్నారి తల నీళ్ల బిందెలో ఇరుక్కుంది. ఎంత ప్రయత్నించినా బిందెలో నుంచి చిన్నారి తల బయటికు రాకపోవడంతో బిందెను జాగ్రత్తగా కత్తిరించి జాగ్రత్తగా బయటకు తీశారు. ఈ ఘటనలో పాపకు ఎలాంటి ప్రమాదం కాలేదు. ఇంత జరుగుతున్నా ఆ చిన్నారి ఏడవకుండా ధైర్యంతో ఉండటాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.