ప్లైవుడ్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం
ATP: తాడిపత్రి పట్టణంలోని మోహనాచారికి చెందిన ప్లైవుడ్ దుకాణంలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.