గ్రామంలో ముందస్తు బడి బాట కార్యక్రమం

NLG: నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో గురువారం గ్రామంలో ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాద్యాయులు ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే చక్కని విద్య లభిస్తుందన్నారు.