'వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా జరపాలి'
BHPL: అధికారులు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా జరపాలని, రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం మొగుళ్ళపల్లి మండలం రంగాపురం, మొట్లపల్లి గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.