అలఘనాథ స్వామి ఆలయ కమిటీ ఏర్పాటు

అలఘనాథ స్వామి ఆలయ కమిటీ ఏర్పాటు

NLR: విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలోని అలఘనాధ స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా, ఆలయ కమిటీ ఛైర్మన్‌గా ఉచ్చూరు సుదీప్ రెడ్డి తో పాటు ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే కమిటీ నిర్వాహకులను కోరారు.