VIDEO: MRO కార్యాలయ ఆవరణలో అగ్నిప్రమాదం

VIDEO: MRO కార్యాలయ ఆవరణలో అగ్నిప్రమాదం

KDP: కమలాపురం MRO కార్యాలయ ఆవరణలోని ఫైల్స్ ఉన్న ఓ గదిలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో కొన్ని ఫైల్స్ దగ్ధమయ్యాయి. అవి ఏ విభాగానికి సంబంధించినవో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆ వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.