మట్టెవాడ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కరుణాకర్

WGL: వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మట్టెవాడ పోలీస్ స్టేషన్ నూతన ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2007సంవత్సరం ఎస్సై బ్యాచ్‌కు చెందిన కరుణాకర్ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఎస్సైగా పని చేశారు. ఇన్‌స్పెక్టర్‌గా ఇంటెలిజెన్స్, సైబర్ క్రైం విభాగాల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హన్మకొండ, మహిళా పోలీస్ స్టేషన్‌లో పని చేశారు.