తెనాలిలో తగ్గుముఖం పట్టిన స్క్రబ్ టైపస్ కేసులు
GNTR: తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్క్రబ్ టైపస్ బాధితులు కోలుకుంటున్నారు. ఇటీవల స్క్రబ్ టైఫస్ లక్షణాలతో వచ్చిన 11 మందికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. తాజాగా ఆరుగురు రోగులు డిశ్చార్జ్ అయ్యారని, మిగిలిన ఐదుగురి ఆరోగ్యం మెరుగ్గా ఉందని హాస్పిటల్ సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.