ప్రత్యేక అలంకరణలో రంగనాథ స్వామి
ATP: తాడిపత్రి మండల పరిధిలోని ఆలూరుకోనలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శేషతల్ప శ్రీ రంగనాథస్వామికి వివిధ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పూలు, వస్త్రాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.