జిల్లాలో వంట గ్యాసు సిలిండర్ల కొరత లేదు
ఏలూరు జిల్లా వ్యాప్తంగా గృహ అవసరాలకు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు వినియోగించే వంట గ్యాసు సిలిండర్ల కొరత ఏమాత్రం లేదని జేసి అభిషేక్ గౌడ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గ్యాసు కొరత ఉందంటూ వచ్చే ఎలాంటి వదంతులను, అపోహలను నమ్మవద్దని గ్యాస్ సరఫరాలో బుకింగ్‌లో ఇబ్బందులు ఉంటే అధికారులకి తెలపాలన్నారు.