'ధురంధర్' చిత్రాన్ని వీక్షించిన విజయ్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ అల్లు సినిమాస్‌లో సందడి చేశారు. తాజాగా విడుదలైన ‘ధురంధర్-2’ చిత్రాన్ని వీక్షించేందుకు ఆయన థియేటర్‌కు వచ్చారు. విజయ్‌ను చూడగానే అభిమానులు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ ఉత్సాహం ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.