మరిపెడలో ప్రభుత్వ విప్ ఎన్నికల ప్రచారం
MHBD: ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా.రాంచంద్రనాయక్ బుధవారం మరిపెడ మండలంలో విస్తృతంగా పర్యటించారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకై ప్రచారం నిర్వహించారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నం.1గా నిలిపేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.