'జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత'

VZM: ఎస్.కోట మండలం బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద మంగళవారం పోలీసులు చేసిన వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్న క్రమంలో కేరళ నుంచి బొలెరో వాహనంలో తరలిస్తున్న సుమారు 150 కేజీల గంజాయి పట్టుబడినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.