ఒక్క రూపాయికే ఫ్లైట్ టికెట్!
దేశీయ దిగ్గజ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో బంపరాఫర్ ప్రకటించింది. పసిపిల్లలు ఉన్న తల్లిదండ్రులు తక్కువ ధరకే ప్రయాణం చేసే అవకాశమిచ్చింది. ఇందుకోసం 'ఇన్ఫాంట్ ఫ్లై ఎట్ రూ.1' పేరుతో స్పెషల్ సేల్ తీసుకొచ్చింది. ఈ ఆఫర్ నవంబర్ 30 వరకు ఉంటుందని వెల్లడించింది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్లో చూడవచ్చు.