VIDEO: వైభవంగా స్వామివారి పల్లకి సేవ
జగిత్యాల జిల్లా పెగడపల్లిలోని స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ సోమవారం అత్యంత వైభవపేతంగా జరిగింది. రంగురంగుల పూలతో అలంకరించిన పల్లకిలో స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్టించి ఊరేగింపు చేశారు. భక్తులు పల్లకి సేవలో భక్తిశ్రద్ధలతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.