పెళ్లిలో నవ్వితే అంతే సంగతులు!

పెళ్లిలో నవ్వితే అంతే సంగతులు!

సాధారణంగా పెళ్లి అంటే సందడి, నవ్వులు. కానీ కాంగోలోని కొన్ని తెగల్లో మాత్రం వధూవరులు అస్సలు నవ్వకూడదు. పెళ్లిని వీరు సీరియస్ వ్యవహారంగా భావిస్తారు. వేడుకలోగానీ, ఫొటోల్లోగానీ నవ్వితే ఆ బంధం పట్ల వారికి చిత్తశుద్ధి లేనట్లు. ఎంత గంభీరంగా ఉంటే, ఆ పెళ్లి పట్ల అంత నిబద్ధతతో ఉన్నట్లు. నవ్వులు లేని ఈ వింత సంప్రదాయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.