వాన బీభత్సం.. వందల ఎకరాల్లో పంట నష్టం
TG: రాష్ట్రంలోని పలు చోట్ల వాన బీభత్సం సృష్టించింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాళ్ల వానలు పడ్డాయి. వందల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. కోత దశకు చేరుకున్న పంట రాళ్లవనా కురిసి నేలపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.