VIDEO: రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు
MDK: రామాయంపేటలోని 44వ జాతీయ రహదారిపై నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. HYD నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న బైకు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108 వాహనంలో వారిని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స అందుతోంది.