ఉదయగిరిలో వాహనాల తనిఖీ

NLR: ఉదయగిరి పట్టణ సమీపంలో గండిపాలెం మార్గంలో ఎస్సై ఇంద్రసేనారెడ్డి మంగళవారం వాహనాలు తనిఖీ చేశారు. లైసెన్స్, రికార్డులు లేకపోవడం, హెల్మెట్ ధరించని వారిని గుర్తించి ఫైన్ విధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు లైసెన్స్ కలిగి ఉండాలని, ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదన్నారు.