VIDEO: గుండెపోటుతో మాజీ సైనికుడు మృతి
కృష్ణా: పెడనలోని 5వ వార్డుకు చెందిన మాజీ సైనికాధికారి ఉస్మాన్ బేగ్ (67) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ఆకస్మికంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే ప్రాంతీయ సైనికులు, పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని బుధవారం నివాళులర్పించారు. లాంచనాలతో ఆయన భౌతికకాయంపై జాతీయ జెండా కప్పారు.