పంతంగి టోల్ గేట్ వద్ద నార్కోటిక్ బ్యూరో తనిఖీలు
BHNG: చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ గేట్ వద్ద నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఇవాళ వాహన తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా వారిలో ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందుతుల నుంచి కారు, ల్యాప్ ట్యాప్, మూడు మొబైల్స్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.