నేడు జిల్లాలో మోస్తరు వర్షాలు..!

నేడు జిల్లాలో మోస్తరు వర్షాలు..!

ప్రకాశం: జిల్లాలో మంగళవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఆ సమయంలో చెట్లకింద నిలబడరాదని సంస్థ ఎండీ ఫఖర్ జైన్ సూచించారు. అలాగే రైతులు వ్యవసాయ మోటార్ల వద్ద జాగ్రత్త వహించాలన్నారు.