కాకినాడ కొత్త డీఆర్ఓగా తిప్పేనాయక్

కాకినాడ కొత్త డీఆర్ఓగా తిప్పేనాయక్

కాకినాడ: జిల్లాకు కొత్త డీఆర్ఓగా డాక్టర్ తిప్పేనాయక్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గత డీఆర్ఓ వెంకటరావు సింహాచలం దేవస్థానం ఈఓగా బదిలీ కావడంతో, అనంతపురం నుంచి తిప్పేనాయక్‌ను నియమించారు. గతంలో 2024లో కూడా ఆయన కాకినాడలో పనిచేశారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రెవెన్యూ అధికారులు ఆయనను అభినందించారు. జిల్లా అభివృద్ధికి అంకితభావంతో పని చేస్తానన్నారు.