IPL: తొలి దశలో హైదరాబాద్‌లో ఒకే ఒక్క మ్యాచ్

IPL: తొలి దశలో హైదరాబాద్‌లో ఒకే ఒక్క మ్యాచ్

బీసీసీఐ ప్రకటించిన ఐపీఎల్ తొలి దశ షెడ్యూల్‌లో హైదరాబాద్ వేదికగా కేవలం ఒకే ఒక్క మ్యాచ్ జరగనుంది. ఏప్రిల్ 5న మధ్యాహ్నం 3:30 గంటలకు లక్నో సూపర్ జెయింట్స్‌తో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. అలాగే, మార్చి 28న బెంగళూరు వేదికగా RCBతో, ఏప్రిల్ 2న కోల్‌కతా వేదికగా KKRతో, ఏప్రిల్ 11న న్యూ చండీగఢ్‌లో పంజాబ్ కింగ్స్‌తో SRH తలపడనుంది.