'90శాతం ఉన్న వికలాంగులకు రూ.10 వేల పెన్షన్'

NDL: ప్రభుత్వం 90శాతం ఉన్న వికలాంగులకు రూ. 10 వేలు పెన్షన్ ప్రకటించిందని నంద్యాల ఎంపీ శబరి తెలిపారు. శనివారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వికలాంగుల అసెస్మెంట్ సమావేశంలో ఆమె మాట్లాడారు. వికలాంగుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. వికలాంగులకు 2 సెంట్ల స్థలం ఇవ్వాలని ఆర్డీవోను ఆదేశించారు. కార్యక్రమంలో 6 మండలాలకు చెందిన దివ్యాంగులు పాల్గొన్నారు.