రేపు గోకవరం మండలంలో పవర్ కట్

రేపు గోకవరం మండలంలో పవర్ కట్

E.G: గోకవరం సబ్‌స్టేషన్‌లో 33/11 కేవీ మరమ్మతుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ JPB నటరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మల్లవరం ఫీడర్‌లోని కొత్తపల్లి, సూది కొండ, కామరాజు పేట గంగంపాలెం గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.