భీమవరంలో శ్రీమద్భగవద్గీత కంఠస్థ పోటీలు

భీమవరంలో శ్రీమద్భగవద్గీత కంఠస్థ పోటీలు

W.G: విశ్వహిందూ పరిషత్ భీమవరం వారి ఆధ్వర్యంలో ఇవాళ 12వ అధ్యాయంపై శ్రీమద్భగవద్గీత కంఠస్థ పోటీలు ప్రఖండ మండల స్థాయిలో జరిగాయి. భీమవరంలోని VHP కార్యాలయంలో మొత్తం150 మందికి 6 స్థాయిలలో ఈ పోటీలు నిర్వహించినట్లు భీమవరం ప్రఖండ కార్యదర్శి రాఘవులు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు ఈనెల 12న జిల్లా స్థాయి శ్రీమద్భగవద్గీత కంఠస్థ పోటీలలో పాల్గొంటారన్నారు.