టీటీడీ లోగోతో మోసం.. నిందితుడు అరెస్ట్
TPT: వీఐపీ దర్శనం పేరుతో మోసం చేస్తున్న నిందితుడు సెంథిల్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా టీటీడీ లోగోతో నకిలీ ప్రకటనలు ఇస్తూ.. ఐదు అడుగుల దూరంలోనే శ్రీవారి దర్శనమంటూ భక్తులను మోసం చేస్తున్నాడు. వారి నుంచి ఒక్కో టికెట్‌కు రూ. 16.500 వరకు వసూళు చేశాడు. తిరుమల పోలీస్‌స్టేషన్లలో అతడిపై కేసులు నమోదవడంతో ఇవాళ అరెస్ట్ చేశారు.