ప్రైవేట్ బిల్లును స్పీకర్‌కు అందించిన బీఆర్ఎస్

ప్రైవేట్ బిల్లును స్పీకర్‌కు అందించిన బీఆర్ఎస్

TG: ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించేందుకు బీఆర్‌ఎస్‌ ప్రైవేటు బిల్లు ప్రతిపాదించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ కార్యదర్శికి నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా బిల్లు ప్రతిని సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌కు అందజేశారు. బిల్లును ఈ సమావేశాల్లోనే అనుమతించాలని కోరారు.