బైక్ కొనివ్వలేదని రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
ATP: తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదని ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాడిపత్రి పట్టణంలోని టైలర్స్ కాలనీకి చెందిన సాయికిరణ్ (21)అనే వ్యక్తి నూతన భవనాల్లో గ్రానైట్ బండలను పరిచే పనిచేస్తుండేవాడు. యువకుడు తల్లిదండ్రులను ద్విచక్ర వాహనం కావాలని అడిగాడు. వారు నిరాకరించడంతో మనస్తాపానికి గురై చెల్లవారిపల్లి వద్ద ఆదివారం అర్ధరాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.