మంత్రాలయం గోశాలలో భారీ అగ్ని ప్రమాదం..

KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం గోశాలలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోడౌన్‌లో పశుగ్రాసం మంటల్లో పూర్తిగా దగ్ధమెంది. మంటలను గమనించిన అక్కడి సిబ్బంది వెంటనే గోవులను సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ప్రమాదంలో లక్షరూపాయల విలువైన పశుగ్రాసం బూడిదైందని శ్రీ మఠం సిబ్బంది తెలిపారు. వెంటనే ఫైర్ సిబ్బంది ఘటన స్థలం చేరుకొని మంటలను అదుపు చేశారు.